{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"18-emdla-nireekshanaku-tera-tanvide-taipee-taitil","title_te":"18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్‌","section":"తాజా","status_line":"18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50682","date":"2026-08-02T20:50:35.000Z","title_te":"18 ఏండ్ల నిరీక్షణకు తెర తన్విదే తైపీ టైటిల్‌","body_te":"భారత యువ బ్యాడ్మింటన్‌ సంచలనం తన్వి శర్మ తైపీ ఓపెన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. తైవాన్‌లో జరిగిన తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆమె మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఫైనల్‌లో తన్వి.. 21-16, 21-16తో ఆరో సీడ్‌ లిన్‌ ఎన్‌గుయెన్‌ (వియత్నాం)ను వరుస సెట్లలో చిత్తుచేసి తన కెరీర్‌లో తొలి బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/17-year-old-tanvi-sharma-creates-history-wins-taipei-open-title-2471359"}]}]}