{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"3-saarlu-meyins-4vasaari-prilims-lone-aagina-upsc-prayaanam-chiv","title_te":"3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు","section":"తాజా","status_line":"3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-89187","date":"2026-08-26T05:00:03.000Z","title_te":"3 సార్లు మెయిన్స్‌.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు","body_te":"యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్ష కోసం నాలుగుసార్లు ప్రయత్నించిన 26 ఏళ్ల అభ్యర్థి చివరికి తన ఏళ్ల నాటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను కేవలం రూ.464కు కబాడీకి అమ్మేశారు. 2023, 2024, 2025లో వరుసగా మూడుసార్లు మెయిన్స్‌కు హాజరైన ఆయన.. తాజా ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ దశలోనే విఫలమయ్యారు. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో ఎన్నో త్యాగాలు చేసి సివిల్స్‌ కోసం చేసిన ప్రయాణానికి ముగింపు పలుకుతూ భావోద్వేగ పోస్టు పెట్టారు. పుస్తకాల ద్వారా వచ్చిన రూ.464ను ఆలయంలో విరాళంగా ఇచ్చిన ఆయన.. ‘ఇక మరోసారి లేదు’ అంటూ తన కన్నీటి గాథను నెటిజన్లతో పంచుకున్నాడు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/upsc-heartbreaking-story-upsc-aspirant-sells-years-of-study-material-for-just-rs-464-after-four-attempts-1896482.html"}]}]}