{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"aayana-ahamkaaram-valle-paarlamemt-samaavesaalu-debbatinnaayi-ra","title_te":"ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..","section":"తాజా","status_line":"ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68462","date":"2026-08-13T09:27:33.000Z","title_te":"ఆయన అహంకారం వల్లే పార్లమెంట్ సమావేశాలు దెబ్బతిన్నాయి: రాహుల్‌ గాంధీపై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం..","body_te":"పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌ అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల చర్చలు, నిర్మాణాత్మక కార్యక్రమాలు సజావుగా సాగలేదని ఆరోపించారు. కేవలం ఒక వ్యక్తి అహంకారం కారణంగానే మొత్తం సమావేశాలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. డిమాండ్లను అంగీకరించినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గకుండా కొత్త డిమాండ్లు తెరపైకి తెస్తున్నాయని ప్రహ్లాద్‌ జోషి విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/union-minister-pralhad-joshi-slams-rahul-gandhi-over-monsoon-session-disruptions-calls-conduct-irresponsible-1887104.html"}]}]}