{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"amerikaalo-bhaarata-samtati-laayar-ku-big-shaak-nakilee-asilam-k","title_te":"అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!","section":"తాజా","status_line":"అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T05:23:12.549Z"},"facts":[],"events":[{"id":"event-46376","date":"2026-07-31T05:00:55.000Z","title_te":"అమెరికాలో భారత సంతతి లాయర్‌కు బిగ్ షాక్… నకిలీ అసిలమ్ కేసులతో రూ. 4 కోట్ల పెనాల్టీ!","body_te":"అమెరికాలో క్లయింట్ల తరఫున నకిలీ ఆధారాలతో అసిలమ్ దరఖాస్తులు దాఖలు చేసిన భారత సంతతికి చెందిన ఇమ్మిగ్రేషన్ లాయర్ సూరజ్ రాజ్ సింగ్‌కు అమెరికా ప్రభుత్వం $4.7 లక్షల భారీ జరిమానా విధించింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన విచారణలో ఆయన 54 కేసుల్లో 118 నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలింది. విభిన్న దరఖాస్తుల్లో ఒకే రకమైన కథనాలను కాపీ-పేస్ట్ చేసి మోసానికి పాల్పడ్డారని డీహెచ్‌ఎస్ వెల్లడించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే లాయర్లపై కఠిన చర్యలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/us-cracks-down-on-indian-origin-lawyer-over-alleged-fake-asylum-applications-1877298.html"}]}]}