{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"andhra-noti-durusu-emtapanichesimdi-bhaarya-vellimdani-alaa-maat","title_te":"Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?","section":"తాజా","status_line":"Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T12:46:03.686Z"},"facts":[],"events":[{"id":"event-41883","date":"2026-07-28T12:32:06.000Z","title_te":"Andhra: నోటి దురుసు ఎంతపనిచేసింది.. భార్య వెళ్లిందని అలా మాట్లాడితేనే కొట్టి చంపేస్తారా..?","body_te":"బాపట్ల జిల్లా చినగంజాం మండలం సంతరావూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో తరచూ దుర్భాషలాడుతున్నాడన్న కక్షతో గొర్రెల కాపరి శ్రీనివాసరావును ముగ్గురు వ్యక్తులు కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఉప్పాల వెంకటనారాయణతో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చీరాల డీఎస్పీ మహ్మద్ మొయిన్ తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/man-beaten-to-death-over-verbal-dispute-in-bapatla-three-arrested-1875471.html"}]}]}