{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ayinaa-manade-paicheyi-poraadina-pasimdu-dinushaa","title_te":"అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా","section":"తాజా","status_line":"అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T23:06:34.193Z"},"facts":[],"events":[{"id":"event-88867","date":"2026-08-25T21:40:32.000Z","title_te":"అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా","body_te":"శ్రీలంక గడ్డపై భారత్‌ జోరు కొనసాగుతోంది. రెండో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. బంతితో మెప్పించలేకపోయిన ఆతిథ్య జట్టు బ్యాట్‌తో ప్రతిఘటించినా.. ఫాలోఆన్‌ ప్రమాదం ముంగిట నిలిచింది. స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (3/83), పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (3/47) రాణించడంతో ఓవర్‌నైట్‌ స్కోరు 8/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక మూడో రోజు, మంగళవారం వర్షంతో ఆట ముగిసిన సమయానికి 83.4 ఓవర్లలో 265/8తో ఎదురీదుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/india-dominate-sri-lanka-as-hosts-slip-to-265-8-in-second-test-2494310"}]}]}