{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"baruvu-taggimche-mamdulu-vaadutunnaaraa-glp-1-aushadhaalapai-kem","title_te":"బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..!","section":"తాజా","status_line":"బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T08:30:23.246Z"},"facts":[],"events":[{"id":"event-54991","date":"2026-08-05T08:17:02.000Z","title_te":"బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..!","body_te":"స్థూలకాయం (ఊబకాయం) చికిత్స కోసం ఉపయోగించే ఆధునిక GLP-1 ఆధారిత మందులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత్‌లోనూ సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి బరువు తగ్గించే మందుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మందులపై జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలు, సోషల్ మీడియా ప్రమోషన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, వ్యాధి అవగాహన పేరుతో జరుగుతున్న పరోక్ష ప్రకటనలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/union-government-tightens-rules-on-weight-loss-glp-1-drugs-and-obesity-medicines-1881219.html"}]}]}