{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-ku-naasaa-pilupu-chamdamaamapai-illu-kadadaamamtoo-aahva","title_te":"భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం","section":"తాజా","status_line":"భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T17:41:23.855Z"},"facts":[],"events":[{"id":"event-72397","date":"2026-08-15T17:11:06.000Z","title_te":"భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం","body_te":"చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్ వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసాన్ని నిర్మించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని భారత్‌ను నాసా ఆహ్వానించింది. బెంగళూరులో జరిగిన భారత్‌-అమెరికా పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఆర్టెమిస్‌ ఒప్పందం కింద సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. శాస్త్రీయ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్‌ సుదూర అంతరిక్ష యాత్రలకు కలిసి పనిచేయనున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/technology-videos/nasa-invites-india-to-join-historic-moon-south-pole-habitat-project-video-tv9d-1889139.html"}]}]}