{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bhaarat-lo-detaa-semtar-boom-2030-naatiki-yuvataku-bhaaree-upaad","title_te":"భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు","section":"తాజా","status_line":"భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T04:45:35.217Z"},"facts":[],"events":[{"id":"event-18818","date":"2026-07-15T04:41:00.000Z","title_te":"భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు","body_te":"భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ పరిశ్రమ దేశంలోని అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటిగా అవతరిస్తోంది. 2030 నాటికి ఈ రంగంలో దాదాపు లక్ష మంది నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఏర్పడనున్నట్లు ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ (NLB Services) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 గిగావాట్ల (GW) స్థాపిత డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, దశాబ్దం చివరి నాటికి ఇది 6.5 గిగావాట్లకు చేరుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో భారత డేటా సెంటర్ మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/indias-data-centre-industry-set-to-create-one-lakh-jobs-by-2030-1865738.html"}]}]}