{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"breastfeeding-tips-vaammo-sijeriyan-ayite-tallipaalu-raavaa-vaid","title_te":"Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే!","section":"తాజా","status_line":"Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T13:29:37.280Z"},"facts":[],"events":[{"id":"event-57085","date":"2026-08-06T12:55:59.000Z","title_te":"Breastfeeding Tips: వామ్మో.. సిజేరియన్ అయితే తల్లిపాలు రావా?.. వైద్య నిపుణులు చెప్తోన్న షాకింగ్ నిజాలివే!","body_te":"ప్రతి ఏడాది ప్రపంచ తల్లిపాల వారోత్సవం (World Breastfeeding Week) సందర్భంగా తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగించేందుకు వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అందులో ఎక్కువగా వినిపించే అపోహల్లో ఒకటి.. \"సిజేరియన్ అయితే తల్లిపాలు సరిగా రావు\" అనేది. అయితే ఇది పూర్తిగా నిజం కాదని శిశు వైద్యులు, ల్యాక్టేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన సహాయం, సరైన పద్ధతిలో బిడ్డను రొమ్ముకు పట్టించడం ద్వారా సిజేరియన్ చేసిన తల్లులు కూడా విజయవంతంగా తల్లిపాలు ఇవ్వగలరని చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/breastfeeding-after-cesarean-delivery-details-in-telugu-1882151.html"}]}]}