{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"bulleeyimg-balipeetham","title_te":"బుల్లీయింగ్‌.. బలిపీఠం","section":"తాజా","status_line":"బుల్లీయింగ్‌.. బలిపీఠం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T22:47:01.097Z"},"facts":[],"events":[{"id":"event-49290","date":"2026-08-01T21:30:47.000Z","title_te":"బుల్లీయింగ్‌.. బలిపీఠం","body_te":"పిల్లలు దైవంతో సమానం అని మన ప్రగాఢ నమ్మకం. అందుకే ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అని పాటలల్లేస్తాం. పిల్లలు తప్పు చేస్తే వారికి పెద్దల్లాగా తీవ్రమైన శిక్షలు విధించం. అటు శాస్ర్తాలు, ఇటు చట్టాలు కూడా పిల్లల నేరం వెనుక పరిసరాల లోపమే కారణమని నమ్ముతాయి. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. తమలో ఏర్పడే ఈర్ష్య, ద్వేషం, కోపం, ఉక్రోషం లాంటి ప్రతికూలమైన ఉద్వేగాలను అదుపు చేసుకునే పరిణతి వారిలో ఉండకపోవచ్చు. ఆ భావనలు తీవ్రమైన చర్యలుగా మారిపోవచ్చు. అందుకు పాఠశాలే ప్రయోగశాల అవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/stop-bullying-in-kids-in-the-classroom-2469182"}]}]}