{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chaaklet-to-aakaliki-chek","title_te":"చాక్లెట్‌తో ఆకలికి చెక్‌","section":"తాజా","status_line":"చాక్లెట్‌తో ఆకలికి చెక్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18302","date":"2026-07-14T19:37:21.000Z","title_te":"చాక్లెట్‌తో ఆకలికి చెక్‌","body_te":"చెమటలు కక్కే జిమ్‌లో.. చాక్లెట్‌ సువాసనలు పెనుమార్పులు తీసుకొస్తున్నాయి. వ్యాయామం చేసేవారిలో ఆకలిని తగ్గిస్తున్నాయి. వారి వ్యాయామ పనితీరును పెంచుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ కోకో ఉండే డార్క్‌ చాక్లెట్‌ను వాసన చూడటం వల్ల.. కసరత్తులు చేసేవారిలో ఆకలి, తినాలనే కోరిక తగ్గిపోయినట్లు పరిశోధకులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/lifestyle/curbing-hunger-with-chocolate-these-findings-were-revealed-in-a-recent-study-published-in-the-journal-frontiers-in-physiology-2451434"}]}]}