{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chamdoorulo-domgalake-domgalu","title_te":"చండూరులో దొంగలకే దొంగలు","section":"తాజా","status_line":"చండూరులో దొంగలకే దొంగలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T21:43:32.971Z"},"facts":[],"events":[{"id":"event-85452","date":"2026-08-23T20:24:03.000Z","title_te":"చండూరులో దొంగలకే దొంగలు","body_te":"రాత్రికి రాత్రి ధాన్యం నిల్వలు మాయమైన సంఘటన చండూరులో చోటు చేసుకుంది. చండూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాంలో ధాన్యం గోల్‌మాల్‌ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి సేకరించి గోదాంలో నిల్వ చేసిన సుమారు రూ.23 లక్షల విలువగల 850 క్వింటాళ్ల ధాన్యం గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి తరలించుకుపోయిన సంఘటన చండూరు మండలం, మున్సిపాలిటీలో తీవ్ర కలకలం రేపుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/850-quintals-paddy-stolen-from-chandur-godown-2492262"}]}]}