{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"dayaabetis-unnavaaru-rojoo-paalu-pamchadaara-tee-taagavachchaa-d","title_te":"డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…","section":"తాజా","status_line":"డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:01:30.539Z"},"facts":[],"events":[{"id":"event-23474","date":"2026-07-17T14:45:39.000Z","title_te":"డయాబెటిస్ ఉన్నవారు రోజూ పాలు, పంచదార టీ తాగవచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే…","body_te":"భారతదేశంలో చాలామందికి ఉదయం లేవగానే పాలు, పంచదారతో చేసిన టీ తాగడం ఒక అలవాటు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనిని ప్రతిరోజూ తాగడం సురక్షితమేనా అనే సందేహం ఉంటుంది. పాలు, రిఫైండ్ చక్కెర కలిపిన టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. షుగర్ ఉన్నవారు టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, దానిని తయారుచేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు పాలు, చక్కెర టీకి ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవాలో వివరంగా తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/is-milk-tea-safe-for-diabetics-risks-benefits-and-healthier-alternatives-1867681.html"}]}]}