{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"el-teelain-ku-taakina-vairlu-kaalina-motarlu","title_te":"ఎల్‌టీలైన్‌కు తాకిన వైర్లు.. కాలిన మోటర్లు","section":"తాజా","status_line":"ఎల్‌టీలైన్‌కు తాకిన వైర్లు.. కాలిన మోటర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T22:12:19.811Z"},"facts":[],"events":[{"id":"event-61000","date":"2026-08-08T21:51:03.000Z","title_te":"ఎల్‌టీలైన్‌కు తాకిన వైర్లు.. కాలిన మోటర్లు","body_te":"విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలకు తీవ్ర నష్టం జరిగింది. 33కేవీ సామర్థ్యం గల విద్యుత్‌ లైన్‌ను నిర్లక్ష్యంగా మార్చడంతో వ్యవసాయ మోటర్లకు వెళ్లే ఎల్టీలైన్‌ను ఆనుకొని విద్యుత్‌ సరఫరా జరగడంతో 12 వ్యవసాయ మోటార్లు కాలిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. మెట్‌పల్లి మండలం చౌలమద్ది గ్రామ శివారులోని ఇస్కాన్‌ ఆలయ సమీపంలో 33కేవీ సామర్థ్యం గల విద్యుత్‌ స్తంభాన్ని సంబంధిత అధికారులు మూడు రోజుల క్రితం వేరే చోటుకు మార్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/the-negligence-of-the-electricity-authorities-caused-severe-losses-to-the-farmers-2477970"}]}]}