{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"enimidi-mamdi-kodukulu-aiduguru-kootullu-unnaa-bhikshaatane-dikk","title_te":"ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!","section":"తాజా","status_line":"ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78440","date":"2026-08-19T11:08:27.000Z","title_te":"ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు.. ప్రజావాణిలో వృద్ధుడి కన్నీటి గాథ!","body_te":"కంటికి రెప్పలా పెంచిన చేతులే ఈరోజు ఆకలితో అల్లాడిపోతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను ప్రయోజకులను చేసిన ఆ తండ్రికి, చివరకు బుక్కెడు అన్నం పెట్టే నాథుడే కరువయ్యాడు. ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా ఆ వృద్ధుడు ఆకలి తీర్చుకోవడానికి ఊరంతా భిక్షాటన చేయాల్సి వస్తోంది. మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన సమాజంలో మానవ సంబంధాలు ఎంత దిగజారిపోతున్నాయో చాటిచెబుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/8-sons-5-daughters-yet-no-one-to-feed-him-elderly-father-begs-officials-for-a-meal-1891832.html"}]}]}