{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"imjaneerimg-kaalejeelaku-tafrc-shaak-ekkuva-pheejulu-gumjite-taa","title_te":"ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!","section":"తాజా","status_line":"ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T14:22:47.774Z"},"facts":[],"events":[{"id":"event-42037","date":"2026-07-28T13:35:04.000Z","title_te":"ఇంజనీరింగ్ కాలేజీలకు TAFRC షాక్.. ఎక్కువ ఫీజులు గుంజితే తాటతీసుడే..!","body_te":"ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలకు టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ ప్రవేశాలు, రుసుముల క్రమబద్ధీకరణ కమిటీ) గట్టి హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ట్యూషన్ ఫీజు కాకుండా అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఎన్‌బీఏ ఫీజు, కెరీర్ డెవలప్‌మెంట్ ఫీజు వంటి పేర్లతో విద్యార్థుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా దానిని క్యాపిటేషన్ ఫీజుగా పరిగణిస్తామని టీఏఎఫ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/tafrc-cracks-down-on-private-engineering-colleges-over-excess-fees-warns-of-heavy-penalties-1875527.html"}]}]}