{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"naadu-harita-haaram-nedu-harita-hananam","title_te":"నాడు హరిత హారం.. నేడు హరిత హననం!","section":"తాజా","status_line":"నాడు హరిత హారం.. నేడు హరిత హననం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T22:22:09.466Z"},"facts":[],"events":[{"id":"event-44249","date":"2026-07-29T21:52:52.000Z","title_te":"నాడు హరిత హారం.. నేడు హరిత హననం!","body_te":"జిల్లా కేంద్రమైన సూర్యాపేటలోని పలు వార్డుల్లో నీడనిచ్చే పలు భారీ వృక్షాలను ఇటీవల కాలంలో నిలువునా నరికేస్తున్నారు. ఇదేమని అడిగితే అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పేర్లు చెబుతుండటం పర్యావరణ ప్రేమికులను, స్థానికులను కలవరపెడుతున్నది. చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రభుత్వం చెబుతూ.. ఓ పక్క వనమహోత్సవాలు నిర్వహిస్తుంటే సూర్యాపేటలో మాత్రం మొక్కలు నాటింది లేదు కానీ.. నిలువునా నరికేస్తుండటంపై పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/cutting-of-huge-trees-in-suryapet-town-2466948"}]}]}