{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nadiroddupai-mainarla-beebhatsam","title_te":"నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం","section":"తాజా","status_line":"నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T21:54:03.051Z"},"facts":[],"events":[{"id":"event-83908","date":"2026-08-22T21:52:46.000Z","title_te":"నడిరోడ్డుపై మైనర్ల బీభత్సం","body_te":"మధురానగర్‌లోని కార్మికనగర్‌లో ఇటీవల ఒక ఇంటర్‌ విద్యార్థి నిర్లక్ష్యంగా కారు నడిపి బీభత్సం సృష్టించాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా కారు అద్దెకు తీసుకున్న సదరు మైనర్‌ వచ్చీరాని డ్రైవింగ్‌తో కారును వేగంగా నడిపి 7 బైకులను ధ్వంసం చేశాడు. మరో బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరు చనిపోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/police-warn-parents-of-strict-action-amid-rising-fatalities-in-minor-driving-cases-2491582"}]}]}