{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nandi-abhishekam-devudaa-raaboye-trayodasi-amta-pavar-phulaa-nam","title_te":"Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?","section":"తాజా","status_line":"Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T13:07:32.090Z"},"facts":[],"events":[{"id":"event-58836","date":"2026-08-07T12:33:44.000Z","title_te":"Nandi Abhishekam: దేవుడా!.. రాబోయే త్రయోదశి అంత పవర్‌ఫులా?.. నందికి ఈ ఒక్క అభిషేకం చేయిస్తే ఏమవుతుందో తెలుసా?","body_te":"హిందూ సంప్రదాయంలో త్రయోదశి తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా శివారాధనకు సంబంధించిన ప్రదోషకాలంలో త్రయోదశి రోజున నందీశ్వరుడిని పూజించడం, అభిషేకం చేయించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. శివాలయంలో శివుడి ఎదురుగా కొలువై ఉండే నందిని కేవలం వాహనంగా మాత్రమే కాకుండా పరమశివుని పరమభక్తుడిగా, శివతత్వానికి ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే త్రయోదశి రోజున నందికి అభిషేకం చేయించి, పూజలు నిర్వహిస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మిక విశ్వాసం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/trayodashi-nandi-abhishekam-benefits-2026-details-in-telugu-1882826.html"}]}]}