{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neracharitra-leni-vidyaarthulanu-takshaname-vidudala-cheyaali-pe","title_te":"‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు","section":"తాజా","status_line":"‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T08:45:53.414Z"},"facts":[],"events":[{"id":"event-41536","date":"2026-07-28T07:57:42.000Z","title_te":"‘నేరచరిత్ర లేని విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలి..’ పేపర్ లీక్ ఆందోళనలపై సుప్రీం కీలక ఆదేశాలు","body_te":"పరీక్షా పత్రాల లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా అరెస్టు అయ్యిన విద్యార్థులకు సుప్రీంకోర్టు కీలక ఊరటనిచ్చింది. 18 ఏళ్లలోపు విద్యార్థులను, అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని నిరసనకారులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో, ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి తదుపరి విచారణ వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/supreme-court-directs-the-release-of-minors-those-without-criminal-past-on-student-protesters-1875349.html"}]}]}