{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"prasnapatram-leek-cheste-ika-tappimchukoleru-kathina-sikshala-bi","title_te":"ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ","section":"తాజా","status_line":"ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T03:55:17.750Z"},"facts":[],"events":[{"id":"event-41085","date":"2026-07-28T03:51:17.000Z","title_te":"ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ","body_te":"నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026పై లోక్‌సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్‌లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/parliament-set-to-debate-tougher-anti-paper-leak-bill-today-after-nationalwide-neet-row-1875221.html"}]}]}