{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"pratikoola-vaataavaranamto-klaud-barast-lu","title_te":"ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు?","section":"తాజా","status_line":"ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T23:10:08.585Z"},"facts":[],"events":[{"id":"event-91982","date":"2026-08-27T20:50:55.000Z","title_te":"ప్రతికూల వాతావరణంతో క్లౌడ్‌బరస్ట్‌లు?","body_te":"ఎలాంటి సూచనలు లేదా హెచ్చరికలు లేకుండా మేఘాలు గర్జించి, విస్ఫోటమై పేలిపోతూ మేఘ విస్ఫోటాలు లేదా క్లౌడ్‌ బరస్ట్‌ రూపంలో ప్రళయం సృష్టించడం ఉత్తర భారత పర్వతశ్రేణుల్లో సర్వసాధారణం అయ్యింది. తాజాగా నేపాల్‌లో సంభవించిన జలప్రళయంలో దాదాపు 359 మంది మరణించినట్టు తెలుస్తున్నది. ఈ ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రకృతి విలయం కారణంగా నేపాల్‌, టిబెట్‌లో 1,600 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/editpage/nepal-359-killed-1600-missing-cloud-burst-2495739"}]}]}