{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"primted-vastraala-debbaku-tegutunna-daaram","title_te":"ప్రింటెడ్‌ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం","section":"తాజా","status_line":"ప్రింటెడ్‌ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T20:32:19.481Z"},"facts":[],"events":[{"id":"event-57542","date":"2026-08-06T19:50:38.000Z","title_te":"ప్రింటెడ్‌ వస్త్రాల దెబ్బకు.. తెగుతున్న దారం","body_te":"వస్త్రం నేసి.. మానవాళికి అందించి నాగరికత నేర్పిన చేనేత రంగం కష్టాల కన్నీటి కలబోత అయ్యింది. దేశంలో వ్యవసాయం తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవు. ఈ రంగంలో కాలానుగుణంగా మార్పులు వస్తున్నా నూలు ధరలు విపరీతంగా పెరగడం, నేసిన వస్త్రానికి రేట్లు పెరగక, కార్మికులకు నేత కూలి రేట్లు పెరగకపోవడంతో కార్మికుల కష్టాలు తీరడం లేదు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన నేతన్నలు అర్ధాకలితో అలమటిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/today-national-handloom-day-2475519"}]}]}