{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rachchabamda-haameeki-naalugellu","title_te":"రచ్చబండ హామీకి నాలుగేళ్లు!","section":"తాజా","status_line":"రచ్చబండ హామీకి నాలుగేళ్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T19:33:22.474Z"},"facts":[],"events":[{"id":"event-72462","date":"2026-08-15T19:32:06.000Z","title_te":"రచ్చబండ హామీకి నాలుగేళ్లు!","body_te":"స్వర్గీయ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సొంతూరైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మారుస్తానని పీసీసీ ప్రెసిడెంట్‌ హోదాలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి నాలుగేళ్లయ్యింది. మే 21, 2022న అక్కంపేటలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, మొదటగా రెవెన్యూ గ్రామంగా మార్చి, జయశంకర్‌ స్మృతి వనం ఏర్పాటు చేస్తానని, పశువుల దవాఖాన నిర్మిస్తానని, జూనియర్‌ కళాశాల మంజూరు చేయిస్తానని, రాహుల్‌గాంధీని తీసుకొస్తానని హామీల వర్షం కురిపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/four-years-since-revanth-reddy-rachabanda-promise-2484557"}]}]}