{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddupai-raktapu-madugulo-baadhitudu-kaanvaay-aapi-praanam-kaapa","title_te":"రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!","section":"తాజా","status_line":"రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35402","date":"2026-07-24T11:49:16.000Z","title_te":"రోడ్డుపై రక్తపు మడుగులో బాధితుడు.. కాన్వాయ్ ఆపి ప్రాణం కాపాడిన మంత్రి జూపల్లి!","body_te":"రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హోదా పక్కనబెట్టి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి సకాలంలో అండగా నిలిచారు. తన ప్రయాణాన్ని మధ్యలో నిలిపివేసి, బాధితుడిని తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించి వెంటనే వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సింగోటం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/youth-injured-in-road-accident-in-nagarkurnool-district-minister-jupally-krishnarao-stops-convoy-and-saves-his-life-1872702.html"}]}]}