{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"simgarenilo-helt-kaardullo-vivaksha-skeemlo-kaarmikulu-adhikaaru","title_te":"సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా","section":"తాజా","status_line":"సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85350","date":"2026-08-23T19:20:09.000Z","title_te":"సింగరేణిలో హెల్త్ కార్డుల్లో వివక్ష?.. స్కీంలో కార్మికులు, అధికారులకు తేడా","body_te":"రాష్ట్రంలో సింగరేణి విస్తరించి ఉన్న పదకొండు జిల్లాల్లో దాదాపుగా 38వేల మంది సింగరేణి బొగ్గుగని కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా బొగ్గు బావులు ఓపెన్‌ కాస్టుల్లో దాదాపుగా 2వేల మంది వరకు ఆఫీస్‌ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే భూగర్భ గనుల్లో, ఓపెన్‌ కాస్టు గనుల్లో పనిచేసే కార్మికులకు కాంట్రిబ్యూటరీ పోస్ట్‌ రిటైర్మెంట్‌ మెడికేర్‌ స్కీం (సీపీఆర్‌ఎంఎస్‌) కింద కేవలం రూ.8లక్షల హెల్త్‌ కార్డులు ఉండగా.. అదే ఆఫీసుల్లో పనిచేసే అధికారులకు మాత్రం రూ.25లక్షల విలువైన హెల్త్‌ కార్డులను ఇచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/singareni-coal-mine-workers-are-employed-across-the-eleven-districts-in-the-state-where-singareni-operates-2492403"}]}]}