{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"sraavana-jamtaku-samsaara-geeta","title_te":"శ్రావణ జంటకు.. సంసార గీత","section":"తాజా","status_line":"శ్రావణ జంటకు.. సంసార గీత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T00:12:31.339Z"},"facts":[],"events":[{"id":"event-84041","date":"2026-08-22T23:00:08.000Z","title_te":"శ్రావణ జంటకు.. సంసార గీత","body_te":"శ్రావణ మేఘాలు రాగాలు తీస్తున్నవేళ.. కొంగుముడి వేసుకుంటున్న కొత్త జంటల్లో ఉరిమే ఉత్సాహం! ఉభయులూ ఒకరికొకరు అభయం ఇచ్చుకున్నా.. బయటికి కనిపించని బెరుకేదో ఆ ఆనందానికి బ్రేక్‌ వేస్తుంటుంది. పెండ్లికి ముందు ఎంత తెలుసుకున్నా.. మూడుముళ్లు పడిన తర్వాత ఇరువురి జీవితమూ వింత ప్రశ్నలతో కూడిన ప్రహేళికలా మారిపోతుంది. సంసార సూత్రాలు, దాంపత్య రహస్యాలు కలివిడిగా పూరిస్తేనే.. పదకేళిక వినోదభరితంగా సాగుతుంది. ఆమెకు జవాబు తట్టకపోతే.. ఆయన వెన్నుతట్టాలి. ఆయనకు ప్రశ్న అర్థం కాకపోతే.. ఆమె విడమర్చి చెప్పాలి. ముద్దులు ఇచ్చి పుచ్చుకున్నంత ఇదిగా... సలహాలు, సూచనలు పంచుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sunday/essential-tips-for-newlyweds-on-communication-romance-and-responsibilities-2490369"}]}]}