{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-bhaktulaku-poleesula-hechcharika-alaamtivi-choosi-namma","title_te":"తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..!","section":"తాజా","status_line":"తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T07:45:50.210Z"},"facts":[],"events":[{"id":"event-44884","date":"2026-07-30T07:44:27.000Z","title_te":"తిరుమల భక్తులకు పోలీసుల హెచ్చరిక.. అలాంటివి చూసి నమ్మారంటే.. మీ పని గోవిందా గోవిందా..!","body_te":"తిరుమల శ్రీవారి భక్తులకు తిరుపతి జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.. శ్రీవారి దర్శనం, వసతి మరియు సేవా టికెట్ల పేరుతో భక్తులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తించింది. టీటీడీ (TTD) అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, సోషల్ మీడియా లింకులను సృష్టించి భక్తుల నుంచి పెద్ద ఎత్తున నగదు కాజేస్తున్నారని హెచ్చరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/tirumala-devotees-alert-police-warn-against-fake-ttd-websites-and-ticket-scams-1876683.html"}]}]}