{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"traaphik-chalaanla-aatodebit-raajyaamga-viruddham","title_te":"ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం","section":"తాజా","status_line":"ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-26T20:52:05.543Z"},"facts":[],"events":[{"id":"event-90380","date":"2026-08-26T20:23:51.000Z","title_te":"ట్రాఫిక్‌ చలాన్ల ఆటోడెబిట్‌ రాజ్యాంగ విరుద్ధం","body_te":"ప్రజల బ్యాంక్‌ ఖాతాల నుంచి నేరుగా ట్రాఫిక్‌ చలాన్లను ఆటో డెబిట్‌ విధానంలో వసూలు చేయాలని యోచించడం రాజ్యాంగ విరుద్ధమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాఫిక్‌ నిబంధనల అమలు ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, చట్టబద్ధమైన ప్రక్రియలను పక్కన పెట్టి పౌరుల ఖాతాల నుంచి తీసుకోవడం సమర్థనీయం కాదని తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/auto-debit-of-traffic-challans-is-unconstitutional-2495017"}]}]}