{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaarevvaa-okesaari-medikal-seetlu-saadhimchina-mugguru-annadammu","title_te":"వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..","section":"తాజా","status_line":"వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T09:27:32.172Z"},"facts":[],"events":[{"id":"event-76540","date":"2026-08-18T09:19:49.000Z","title_te":"వారెవ్వా.. ఒకేసారి మెడికల్ సీట్లు సాధించిన ముగ్గురు అన్నదమ్ములు..","body_te":"తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు రామ్ కుమార్ కుటుంబానికి ఈ ఏడాది NEET ఫలితాలు జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని ఇచ్చాయి. ఆయన ముగ్గురు కుమారులు వెంకట్ శ్రీ, ధరణ్, అరుణ్ ఒకే ఏడాది NEETలో అర్హత సాధించి MBBS సీట్లు దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఈ ముగ్గురూ తమిళనాడులోని 7.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కోటా ద్వారా మెడికల్ సీట్లు సాధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/three-brothers-from-weaver-family-secure-mbbs-seats-in-neet-1891006.html"}]}]}