{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"varisaagu-taggimdi-varshaabhaavamto-ee-edaadi-pamtala-amchanaalu","title_te":"వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు","section":"తాజా","status_line":"వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T20:16:17.519Z"},"facts":[],"events":[{"id":"event-78982","date":"2026-08-19T19:51:19.000Z","title_te":"వరిసాగు తగ్గింది.. వర్షాభావంతో ఈ ఏడాది పంటల అంచనాలు తలకిందులు","body_te":"ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు భారీగా తగ్గింది. వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అంతేకాకుండా ఈ ఏడాది నెలన్నర రోజులకు పైగా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. వాతావరణంలో వేడి తీవ్రత కూడా తగ్గడం లేదు. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు వ్యవసాయాధికారులు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించడంతో వరిసాగు చేసే రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/el-nino-impact-paddy-cultivation-plummets-in-bhadradri-district-2488478"}]}]}