{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"veeramganaath-aut-9-talala-sarpam-koralu-peekina-nyaayam","title_te":"వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం!","section":"తాజా","status_line":"వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40789","date":"2026-07-27T21:23:09.000Z","title_te":"వీరంగనాథ్‌ ఔట్‌!.. 9 తలల సర్పం.. కోరలు పీకిన న్యాయం!","body_te":"హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను తక్షణం పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఎట్టి పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగిండానికి వీలులేదని స్పష్టం చేసింది. రంగనాథ్‌పై ఏడాదిన్నరకాలంలోనే ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు దాఖలవడంపై విస్మయం వ్యక్తం చేసింది. ఆయన ఏ స్థాయిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారో స్పష్టం అవుతున్నదని పేర్కొన్నది. ఇలాగే వదిలేస్తూ పోతే గ్రీకు పురణాల్లో ‘హైడ్రా’ పేరుతో ఉన్న చావులేని అనేక తలల పాములా ఈ హైడ్రా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/high-court-seeks-removal-of-hydraa-commissioner-av-ranganath-2465047"}]}]}