{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vemtaade-vedanaku-pannemdemdlu","title_te":"వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు","section":"తాజా","status_line":"వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T21:01:36.579Z"},"facts":[],"events":[{"id":"event-44185","date":"2026-07-29T20:11:27.000Z","title_te":"వెంటాడే వేదనకు.. పన్నెండేండ్లు","body_te":"ఎంతో ఆనందంతో బడికి వెళ్తున్న ఆ చిన్నారులను రైలు బండి ఒక్కసారిగా మింగేసింది. అప్పటిదాకా పిల్లల కేరింతలతో ఆహ్లాదకరంగా ఉన్న ఆ ప్రాంతం అంతలోనే ఆర్తనాదాలతో భీతావహంగా మారిపోయింది. మాయని గాయంగా మిగిలిపోయిన మాసాయిపేట రైలు ప్రమాద దుర్ఘటన జరిగి పుష్కరకాలం గడిచిపోయింది. 2014 జూలై 24న జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది అభం శుభం ఎరుగని చిన్నారులు బలయ్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/success-story/masayipet-rail-tragedy-a-decade-later-painful-memories-remain-2467185"}]}]}